తండ్రి పోయిన బాధలో ఉంటే.. ప్రెగ్నెంట్ అని ప్రచారమా? : హీరోయిన్

by Jakkula Samataha |   ( Updated:2021-03-10 09:02:14.0  )
Gauahar khan pregnency news
X

దిశ, సినిమా : హిందీ టెలివిజన్ స్టార్ గౌహర్ ఖాన్ మీడియాపై మండిపడింది. తను ప్రెగ్నెంట్ అని ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంపై ఫైర్ అయింది. మూడు రోజుల క్రితం తన తండ్రి జాఫర్ అహ్మద్ ఖాన్ చనిపోయారని, ఆ బాధలో తను ఉంటే ఇలాంటి వార్తలు ప్రచురించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. ‘మీ మైండ్ ఖరాబ్ అయిందా. వార్త రాసే ముందు నిజానిజాలు తెలుసుకోండి. నేను నా తండ్రిని కోల్పోయా కాబట్టి మీ నిరాధార వార్తల పట్ల సున్నితంగా మాట్లాడుతున్నా. నేను ప్రెగ్నెంట్ కాదు.. థాంక్యూ వెరీ మచ్’ అని ట్వీట్ చేసింది. కాగా గౌహర్ చివరగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ‘తాండవ్’ సిరీస్‌లో ఓ కీలకపాత్రలో కనిపించింది.

Advertisement

Next Story