‘గతం’ చిత్రానికి అరుదైన గౌరవం

by Shyam |
‘గతం’ చిత్రానికి అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గతం’ మూవీ ఘనకీర్తి సొంతం చేసుకుంది. 51వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ఇండియన్ పనోరమ కేటగిరీలో ప్రదర్శితం కానున్న సినిమాల్లో ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన సినిమా నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాగా.. కిరణ్ కొండమడుగుల దర్శకత్వం వహించారు. భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ప్రధానపాత్రల్లో రూపొందిన సినిమాను భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్‌లు నిర్మించారు. కాగా జనవరి 16 నుంచి 24 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమ ఒక ప్రధాన విభాగం. ఈ ఫెస్టివల్‌లో 23 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించేందుకు జూరీ మెంబర్స్ సెలెక్ట్ చేశారు.

ఫీచర్ ఫిల్మ్స్:

1. బ్రిడ్జ్(అస్సాం).. క్రిపాల్ కలిత
2. అవిజత్రిక్(బెంగాలీ).. శుభ్రజిత్ మిత్ర
3. బ్రహ్మ జనె గోపోన్ కొమ్మొటి(బెంగాలీ).. అతిర ముఖర్జీ
4. ఏ డాగ్ అండ్ హిస్ మ్యాన్(చత్తీస్‌ఘరీ).. సిద్ధార్థ్ త్రిపాఠి
5. అప్ అప్ అండ్ అప్(ఇంగ్లీష్).. గోవింద్ నిహాలని
6. అవర్తన్(హిందీ).. దుర్బా సాహయ్
7. సాండ్ కీ ఆంఖ్(హిందీ).. తుషార్ హిరానందని
8. పింకి ఎల్లి?(కన్నడ).. పృథ్వీ కోననుర్
9. సేఫ్(మలయాళం).. ప్రదీప్ కలిపురయత్
10. ట్రాన్స్(మలయాళం).. అన్వర్ రషీద్
11. కెత్తియోలాను ఎంటె మలఖ(మలయాళం).. నిస్సం బషీర్
12. తహీరా(మలయాళం).. సిద్ పరవూర్
13. ఈగీ కొన(మణిపురి).. బాబీ వెహెంగ్‌బమ్
14. జూన్(మరాఠి)..వైభవ్ కిస్తి, సుహృద్ గాడ్‌బొలె
15. ప్రవాస్(మరాఠి).. శశాంక్ ఉదపుర్కర్
16. కర్ఖనిసంచి వారి(మరాఠి).. మంగేష్ జోషి
17. కలిరా అతిత(ఒరియా).. నీలా మదబ్ పాండా
18. నమో(సంస్కృతం).. విజీష్ మని
19. థాయెన్(తమిళ్).. గణేష్ వినాయకన్
20. గతం(తెలుగు).. కిరణ్ కొండమడుగుల

మెయిన్ స్ట్రీమ్ సినిమా సెలెక్షన్:
అసురన్(తమిళ్).. వెట్రిమారన్
కప్పెల(మలయాళం).. ముహమ్మద్ ముస్తఫా
చిచోరే( హిందీ).. నితీష్ తివారి

నాన్ ఫీచర్ ఫిల్మ్స్:
1. 100 సంవత్సరాల క్రిసోటోమ్(ఇంగ్లీష్).. బ్లెస్సీ ఐప్ థామస్
2. అహింస – గాంధీ (ఇంగ్లీష్) .. రమేష్ శర్మ
3. క్యాట్ డాగ్(అశ్మిత గుహ నియోగి).. హిందీ
4. డ్రామా క్వీన్స్(సోహినీ దాస్‌గుప్తా).. ఇంగ్లీష్
5. గ్రీన్ బ్లాక్ బెర్రీస్(నేపాలి).. పృథ్వీరాగ్ దాస్ గుప్తా
6. హైవేస్ ఆఫ్ లైఫ్(మణిపురి).. మైబమ్ అమర్జీత్ సింగ్
7. హోలీ రైట్స్(హిందీ).. ఫర్హాన్ ఖాతున్
8. ఇన్ అవర్ వరల్డ్(ఇంగ్లీష్).. శ్రీధర్ బీఎస్
9. ఇన్వెస్టింగ్ లైఫ్(ఇంగ్లీష్).. వైశాలీ వసంత్ కెండాలె
10. జాదూ(హిందీ).. శూర్వీర్ త్యాగి
11. ఝట్ ఆయీ బసంత్(హిందీ).. ప్రమతి ఆనంద్
12. జస్టిస్ డిలేడ్ బట్ డెలివర్డ్(హిందీ).. కమాఖ్య నారాయణ్ సింగ్
13. ఖీసా(మరాఠి).. రాజ్ ప్రీతమ్ మోర్
14. ఓరు పాతిరా స్వప్నమ్ పోల్(మలయాళం).. శరణ్ వేణుగోపాల్
15. పాంచిక(గుజరాతి).. అంకిత్ కొఠారి
16. పంధారా చివ్డా(మరాఠి).. హిమాన్షు సింగ్
17. రాధ(బెంగాలి).. బిమాల్ పొద్దర్
18. శాంతాబాయి(హిందీ).. ప్రతీక్ గుప్తా
19. స్టిల్ అలైవ్(మరాఠి).. ఓంకార్ దివాకర్
20. ద 14 ఫిబ్రవరి అండ్ బియాండ్(ఇంగ్లీష్).. ఉత్పల్ కలాల్

Advertisement

Next Story