ఆసియాకప్ రద్దు: గంగూలీ

by Shyam |
ఆసియాకప్ రద్దు: గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్: ఆసియాకప్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దూకుడుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కళ్లెం వేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరుగాల్సిన ఆసియా టీ20 కప్ రద్దయ్యిందని ప్రకటించారు. ‘స్పోర్ట్స్ తక్’ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. గురువారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశమై ఆసియాకప్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ, అంతకంటే ముందే టోర్నీ రద్దయినట్లు గంగూలీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. టీమ్‌ఇండియా మళ్లీ మైదానంలో ఎప్పుడు దిగుతుందని గంగూలీని ప్రశ్నించగా ‘కొవిడ్-19 కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరుగాల్సిన ఆసియా కప్ రద్దు అయ్యింది. దీంతో టీమ్‌ఇండియా మళ్లీ ఎప్పుడు క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెడుతుందో అనేది సందిగ్ధంగా ఉంది’ అని సమాధానం ఇచ్చారు. ఏసీసీలో కీలక సభ్యత్వం కలిగిన బీసీసీఐ నుంచే ఇలాంటి ప్రకటన రావడం ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బే అనుకోవాలి.

Advertisement

Next Story