సూర్యాపేటలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాల కలకలం.. పంచలోహ విగ్రహాన్ని విక్రయిస్తూ..

by Sumithra |
Suryapet
X

దిశ, సూర్యాపేట : పురాతనమైన పంచలోహ విగ్రహాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన రెండు అంతర్ రాష్ట్ర ముఠాల సభ్యులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర సరిహద్దులను దాడి వచ్చి విగ్రహం విక్రయానికి డీల్ చేస్తుండగా సీసీఎస్ పోలీసులో కలిసి పట్టణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మిట్టపల్లి వేణుగోపాల్ ఐదేళ్ల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.5 లక్షలు పెట్టి పురాతనమైన గౌతమ బుద్ధుడు పంచలోహ విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఆ విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే తమకు శుభంకలుగుతుందని, ఆర్థికంగా కలిసి వస్తుందని భావించాడు. అయితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో దానిని విక్రయించాలనుకున్నాడు. గత 3 నెలలుగా ఆ విగ్రహాన్ని ఇతరులకు అమ్మడానికి వెంకటనర్సింహా రావు, పురుషోత్తం, నవీన్ బాబు, భాను ప్రకాష్ అనే నలుగురు వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. ఆ విగ్రహాన్ని కృష్ణా జిల్లాకు చెందిన యూనిస్ అనే వ్యక్తి చెందిన మరో ముఠా సభ్యులకు కోటి రూపాయలకు అమ్మి వచ్చిన లాభాన్ని పంచుకోవాలని అనుకున్నారు.

Sp rajendraprasad

యూనిస్ ముఠా విగ్రహాన్ని కొని రూ.2 కోట్లకు అమ్మితే డబ్బులు వస్తాయని భావించారు. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో విక్రయిస్తే పోలీసులు గుర్తు పడతారని అనుమానించిన ఇరు ముఠాలు.. సూర్యాపేటను సేప్ జోన్‌గా ఎంచుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం రెండు ముఠా సభ్యులు సూర్యాపేట పట్టణానికి వచ్చి కొత్త బస్టాండ్ ప్రాంతంలో విగ్రహం గురించి మాట్లాడుకుంటుండగా పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తం అయిన సూర్యాపేట పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.

11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన 26.3 కే‌జీల పురాతనమైన గౌతమ బుద్దుని పంచలోహ విగ్రహం, డబ్బులు లెక్కింపు మిషన్, వేయింగ్ మిషన్, ఇన్నోవా కారు, 11 సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచర్యంగా వ్యవహరించిన సూర్యాపేట సీసీఎస్, పట్టణ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారందరికీ రివాడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితిరాజ్ ఐపీఎస్, డీఎస్పీ మోహన్ కుమార్, సీసీఎస్ ఎస్ఐ నర్సింహ, పట్టణ సీఐ ఆంజనేయులు, ఎస్ఐ నరేష్, సీసీఎస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed