దుర్మార్గులు గొడ్డళ్లతో డాల్ఫిన్ ను చంపారు

by Anukaran |   ( Updated:2021-01-08 07:00:40.0  )
దుర్మార్గులు గొడ్డళ్లతో డాల్ఫిన్ ను చంపారు
X

దిశ,వెబ్‌డెస్క్ : గంగా నది డాల్ఫిన్ (గంగెటిక్ డాల్ఫిన్) ఒక రకమైన నదీ జలాలలో జీవించే డాల్ఫిన్. ఈ నదీ డాల్ఫిన్లు ఎక్కువగా బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్థాన్ దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో గంగా, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదుల్లో జీవిస్తాయి. అయితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సైతం గంగెటిక్ డాల్ఫిన్ ను కాపాడాలంటూ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాయి. కానీ పలువురు ఆకతాయిలు గంగెటిక్ డాల్ఫిన్ల ప్రాణాలు తీస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన కొటారియా గ్రామానికి సమీపంలో ఓ ఉపనది ప్రవహిస్తుంది. అయితే ఆ ఉపనదిలో గంగెటిక్ డాల్ఫిన్ గ్రామానికి చెందిన యువకుల కంటపడింది. అంతే గొడ్డలితో, కర్రలతో ఆ డాల్ఫిన్ ను హతమార్చేందుకు ప్రయత్నించారు. డాల్ఫిన్ ను చంపేస్తున్నారని సమాచారం అందుకున్న గ్రామస్థులు.. ఆ డాల్ఫిన్ ను చంపొద్దని వారించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు చెప్పే మాటల్ని పట్టించుకోని జులాయి గ్యాంగ్ డాల్ఫిన్ ను రౌండప్ చేసి గొడ్డలితో తీవ్రంగా గాయం చేశారు. నిందితుల దాడిలో గాయపడ్డ డాల్ఫిన్ ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు డాల్ఫిన్ ను గొడ్డలితో దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed