ఎవరూ చేయలేని పని కరోనా చేయగలిగింది!

by sudharani |
ఎవరూ చేయలేని పని కరోనా చేయగలిగింది!
X

దిశ, వెబ్‌డెస్క్: గంగా నదిని ప్రక్షాళన చేసి శుభ్రం చేయాలనే అంశాన్ని మేనిఫెస్టోల్లో పెట్టారు, రివ్యూలు చేశారు, కమిటీలు, కమిషన్లు వేశారు, కొత్త టెక్నాలజీ తీసుకొస్తామన్నారు… కానీ ఎన్ని చేసినా కావాల్సిన ఫలితంలో 20 శాతం కూడా చూపించలేకపోయారు. కానీ ఇన్ని విధానాలు చేయలేకపోయిన పని కరోనా వైరస్ చేసేసింది. అవును… భారతీయలు పాటిస్తున్న లాక్‌డౌన్ కారణంగా నదీజలాల్లోని నీరు పరిశుభ్రంగా తయారైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా గంగానది నీటి నాణ్యత పెరిగిందని ఐఐటీ బీహెచ్‌యూ, వారణాసి కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. గంగా నదిలో కలిసే వ్యర్థాల్లో పరిశ్రమల నుంచి విడుదలయ్య వ్యర్థాలే పది శాతం వరకు ఉంటాయి. ఇవి మూతపడటంతో గంగా నీటి నాణ్యత 30 నుంచి 40 శాతం పెరిగిందని మిశ్రా వెల్లడించారు. మార్చి 15, 16 తేదీల్లో సేకరించిన గంగాజల నమూనాలు పరిశీలించి ఆయన ఈయన ప్రకటన చేశారు. అలాగే వారణాసి నివాసితులు కూడా నీటిని చూస్తుంటేనే నాణ్యత పెరిగినట్లు కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వైరస్ భయం వల్ల ప్రజలు కూడా గంగా నదిలో స్నానాలు చేయట్లేదని, వ్యర్థాలు కలపకపోవడంతో గంగానది నీళ్లు ఎన్నడూ చూడనంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో గాలి కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.

Tags: Ganga Water, Ganges River, corona virus, lockdown, quarantine

Advertisement

Next Story

Most Viewed