- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగాల పేరిట మోసగిస్తున్న ముఠా అరెస్టు
దిశ, కోదాడ: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న ముఠాను సూర్యపేట జిల్లా మేళ్లచెరువు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వివరాలను కోదాడ రూరల్ సీఐ శివరామిరెడ్డి మీడియాకు వెల్లడించారు. మేళ్లచెరువు మండలం మంగలికుంట తండాకు చెందిన భూక్య లకృతికి హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చిలుకూరు మండలం శీతల తండాకు చెందిన నునవాత్ తావుర్య లక్షా 50 వేల రూపాయలను తీసుకున్నారు. ఆ తర్వాత తప్పించుకొని తిరుగుతుండడంతో గతేడాది డిసెంబర్ 5న లకృతి మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌లో తావుర్యపై ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చిలుకూరు మండల కేంద్రంగా కొందరు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసగిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నమ్మదగిన సమాచారం మేరకు ఆ ముఠాలోని తావుర్య, హైదరాబాద్ బొల్లారంకు చెందిన జనార్ధన్ ఆచార్య, దుధియా తండాకు చెందిన భూక్య శ్రీకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.