ప్రశంసలు అందుకుంటున్న ‘గమనం’ ట్రైలర్

by Shyam |
ప్రశంసలు అందుకుంటున్న ‘గమనం’ ట్రైలర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక ప్రేమ జంట కథ.. భర్త కోసం ఓ భార్య ఎదురు చూపు.. పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోవాలనుకొనే ఓ పిల్లోడి కల.. ఈ మూడు కథల సంగమమే ‘గమనం’. ఈ సినిమా సుజనా రావు దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచింది. శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి కీలక పాత్రల్లో నటించిన సినిమాలో నిత్యా మీనన్ గెస్ట్ రోల్ పోషించింది. చెవిటి పాత్రలో నటించిన శ్రియ.. ఓ బిడ్డకు తల్లిగా, దుబాయ్‌లో ఉన్న భర్త రాకకోసం ఎదురుచూసే మహిళగా ఫర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక కపిల్ దేవ్, ధోనీలా తన పేరుకూడా మారుమ్రోగుతుందని కాన్ఫిడెన్స్‌తో ఉన్న శివ కందుకూరి కోసం ప్రియురాలు ప్రియాంక జవాల్కర్ డబ్బులు అప్పు తెచ్చి మరీ తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసేందుకు ట్రై చేయడం.. ఈ క్రమంలో తండ్రి దగ్గర మాట పడటం.. మరో వైపు రోడ్డుపక్కన నివసించే ఇద్దరు పిల్లలు పుట్టినరోజు చేసుకోవాలని కల కనడం.. ఈ మూడు కథలకు రెండ్రోజుల పాటు ఏకధాటిగా కురిసే భారీ వర్షానికి లింక్ చేస్తూ మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తి రేకిత్తిస్తోంది.

క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, కాళి ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గమనం’ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం మరింత ప్లస్ కానుంది. నిత్యా మీనన్ సింగర్‌గా కనిపించనుండటంతో మ్యాస్ట్రో మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుందనే చెప్పాలి. సాయి మాధవ్ బుర్రా అందించిన ‘మర్యాదతో మట్టిలో కలుపుతావనుకున్నాం, కానీ మర్యాదనే మట్టిలో కలిపావు’ లాంటి డైలాగ్స్ ఎమోషనల్ ఫీల్ ఇస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో వస్తున్న సినిమా హిందీ ట్రైలర్‌ను సోనూసూద్, తమిళ్‌లో జయం రవి, కన్నడలో శివరాజ్ కుమార్, మళయాళ ట్రైలర్ ఫహద్ ఫాజిల్ రిలీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed