గగన్‌యాన్ ఫస్ట్ మిషన్ వాయిదా

by Shamantha N |
ISRO
X

బెంగళూరు: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే తొలి మానవరహిత ప్రయోగం నిర్దేశించుకున్న గడువులో సాధ్యపడదని ఇస్రో వెల్లడించింది. ఈ మిషన్ కోసం దేశవ్యాప్తంగా ఇండస్ట్రీల నుంచి హార్డ్‌వేర్ ఎలిమెంట్స్ సంస్థకు చేరాల్సి ఉంది. కానీ, కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లో ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా డెలివరీ సకాలంలో జరగలేదు. ఈ కారణంగానే గగన్‌యాన్ ఫస్ట్ మిషన్ డిసెంబర్‌లో సాధ్యం కాదని, వాయిదా పడక తప్పదని ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారు.

తొలి మిషన్‌ను వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందని తెలిపారు. గగన్‌యాన్ మిషన్‌లో ముగ్గురు సిబ్బందిని ‘లో ఎర్త్ ఆర్బిట్‌(దిగువ భూ కక్ష్య)’లోకి తీసుకెళ్లి మళ్లీ నిర్దేశించుకున్న చోట నేలపై సేఫ్‌గా దింపాలి. దీనికోసం ముందుగా రెండు సార్లు మానవరహిత పరీక్షలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. ఇందులో తొలి టెస్టును డిసెంబర్‌లో చేయాలని షెడ్యూల్ చేసుకుంది. కానీ, కరోనా సంక్షోభంతో ఈ టెస్టు వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed