గగన్‌యాన్ కోసం మళ్లీ మొదలుపెట్టారు!

by Shamantha N |
గగన్‌యాన్ కోసం మళ్లీ మొదలుపెట్టారు!
X

న్యూఢిల్లీ: భారత్ చేపట్టబోతున్న మొట్టమొదటి మానవసహిత ఆపరేషన్ ‘గగన్‌యాన్’ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల శిక్షణ తిరిగి ప్రారంభమైంది. కొవిడ్ 19 భయాందోళనల నడుమ రష్యాలో వారి ట్రెయినింగ్‌ను తాత్కాలికంగా నిలిచినా.. తాజాగా, పున:ప్రారంభమైంది. రష్యాకు చెందిన గ్లవ్‌కాస్మోస్, భారత్‌కు చెందిన ఇస్రో సంస్థల మధ్య ఒప్పందం మేరకు మే 12న ఈ నలుగురు భారత వ్యోమగాముల శిక్షణను తిరిగి ప్రారంభించినట్టు రష్యన్ స్పేస్ కార్పొరేషన్(రాస్‌కాస్మోస్) ఓ ప్రకటనలో తెలిపింది. సామాజిక దూరం, మాస్కులు, గ్లౌవ్స్‌ వినియోగం లాంటి ముందు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్టు పేర్కొంది. 2020లో లాంచ్ చేయబోతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు పైలట్‌లు వ్యోమగాములుగా ఎంపిక అయ్యారు. రష్యాలో వారు సుశిక్షితులవుతున్నారు. ఈ వ్యోమగాములు ఇండియన్ ఫ్లాగ్‌ చిహ్నం, స్పేస్ సూట్ ధరించిన ఫొటోలను రాస్‌కాస్మోస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Advertisement

Next Story