కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం

by sudharani |
కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం
X

దిశ, న్యూస్ బ్యూరో: కోవిడ్-19(కరోనా) వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టింది. గచ్చిబౌలి స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలోని పరిపాలన విభాగంతోపాటు అందుబాటులో ఉన్న గదులన్నీ ఆధీనంలోకి తీసుకుని వైరస్ నివారణ వార్డుల కింద తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ స్టేడియాన్ని 300 పడకల క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం స్టేడియాన్ని పరిశీలించారు. శేరిలింగంపల్లి సర్కిల్ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది స్టేడియంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రెండ్రోజుల్లో పూర్తి స్థాయిలో స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

tags : Gachibowli Stadium, center of the Corona Quarantine, 300 beds, sanitation works, hyderabad

Advertisement

Next Story

Most Viewed