- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కల శ్మశానంలో కొవిడ్ మృతదేహాల దహనం
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వచ్చిన వాళ్లకు ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకడం లేదు. పైరవీలు చేయించుకుని బెడ్ సంపాదిస్తే ఆక్సిజన్ కోసం ఎమ్మెల్యేనో, మంత్రో మళ్లీ రికమండ్ చేయాల్సిందే. మరి చనిపోయిన వారికి ఎవరు పైరవీ చేయాలి. కరోనా మృతులతో శ్మశానాల్లో ఫుల్ రద్దీ నెలకొంది. అంత్యక్రియల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయినా ఆరడుగుల జాగ దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. దీంతో కరోనా మృతదేహాలతో బంధువులు కనబడిన శ్మశాన వాటికనల్లా జాగ కోసం వాకాబు చేయాల్సిన దుస్థితి దాపురించింది.
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరోనా మృతదేహాల అంత్యక్రియలుకు శ్మశాన వాటికలు సరిపోవడం లేదు. దీంతో బంధువులు కొత్త ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. చివరకు ద్వారకా సెక్టార్ 29లో ఉన్న కుక్కల శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు దహన సంస్కరాలు నిర్వహించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాత్కాలికంగా ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
మూడు ఎకరాల కుక్కల శ్మశాన వాటిక స్థలం ఆరు నెలల క్రితం నిర్మించారు. ఇంకా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు 800 పైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్య వేయికి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఖాళీ ప్రదేశాలతో అధికారులు ఫోకస్ పెట్టారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా అక్కడ అంత్యక్రియలు చేసేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, అంత్యక్రియల అనంతరం తుది కర్మలు నిర్వహించడానికి యమునా నది ఘాట్స్ వద్ద వేదికలు నిర్మిస్తున్నారు.