- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా టైంలో అంత్యక్రియల ఖర్చు రూ. 2 లక్షలు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మనిషి పుట్టింది మొదలు కట్టెకాలే వరకూ ఆచారాలు, కట్టుబాట్లకు విలువనిస్తాడు. బారసాల నుంచి అంత్యక్రియల వరకు ప్రతీది పాటిస్తాడు. కరోనా కాలం సామాన్య, మధ్యతరగతి జీవితాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆర్నెళ్లుగా పనులు లేకుండా అనేక కుటుంబాలు పస్తులుంటున్నాయి. కుటుంబ పోషణే భారంగా మారింది. ఈ తరుణంలో అనుకోకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మృతిచెందితే వారి పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’గా తయారవుతోంది. కుల కట్టుబాట్ల ప్రకారం అంత్యక్రియలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. కరోనా నేపథ్యంలో చివరి ప్రయాణం కాస్ట్లీగా మారింది. అంత్యక్రియలకు సమారు రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతోంది. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు మోయని బరువుగా మారుతోంది.
మనిషి చనిపోయినప్పుడు నిర్వహించే అంత్యక్రి యల్లో వివిధ కులాల పాత్ర ప్రధానంగా ఉంటుం ది. అందులో కుమ్మరి, చాకలి, మంగలి, బేగరి, మాదిగ, కాటికపాపల, గంగిరెద్దుల కులస్తులు ఆనాది నుంచి వస్తున్న వృత్తిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ కులాలు గ్రామీణ ప్రాంతాల్లో కట్టడి చేసుకుని వృత్తి పనులు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెద్దగా పట్టింపు లేకపోవుడంతో ఖర్చుకు తగ్గట్టుగానే సంప్రదాయాలను పాటిస్తున్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చి తంగా సంప్రదాయాలను అమలు చేసే కార్యక్ర మం జరుగుతుంది. పేద కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు సుమారుగా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల ఖర్చు అవుతుంది. దీంతో మనిషి మరణించే బాధ కంటే అంత్యక్రియలకు చేసిన అప్పు ఎలా తీర్చాలనే వేదనే అధి కంగా ఉంటుంది. ఈ అంత్యక్రియల్లో పాల్గొనే ప్రజలు, బంధువులు కుటుంబ పరిస్థితిని చూసి తలా ఇంత డబ్బులు ఇచ్చే దుస్థితి పల్లెల్లో కనిపిస్తోంది.
కరోనా కాలంలో తప్పని తిప్పలు..
రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అంత్యక్రియలు నిర్వహించడం చచ్చిబతికనంత పనైతుంది. గ్రామా ల్లో కులం కట్టడి ప్రకారం పెళ్లి, చావు కార్యక్రమాలు నిర్వహించాల్సిందే. ఆ కట్టడిని పాటించ ని వారిని వివక్షతోచూస్తారు. దీంతో మనస్తాపానికి గురై అప్పులు చేసి కట్టడికి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తారు. కరోనా సమయంలోనూ కొనసాగించడం దారుణమని విద్యావంతులు వాపోతున్నారు. మనిషి చనిపోయినప్పుడు నిర్వ హించే అంత్యక్రియల్లో మాదిగ, కుమ్మరి, బేగరి, చాకలి వాళ్లు చేసే కార్యక్రమాలు తప్పనిసరి. కానీ, పలు గ్రామాల్లో కులస్తులు కట్టడి చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. మరికొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మానవత్వంతో అడుగులు వేస్తున్నా రు. అయినప్పటికీ పలు చోట్ల అంత్యక్రియలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.
అంత్యక్రియలు ఆగిపోవాల్సిందే..
జిల్లాలోని పలు గ్రామాల్లో కులాలు కట్టడి చేసుకుంటున్నాయి. మనిషి చనిపోతే కచ్చితంగా డప్పులు సంఖ్య, డప్పుకు ఇంత ఇవ్వాల్సిందే. కుండకు, చాకలి, బేగరి కులస్తులు ఇంత కంటే తక్కువ తీసుకునేది లేదని స్పష్టం చేస్తారు. ఒక వేళ తగ్గించకపోతే ఆ కులవృత్తులు చేసే కార్యక్రమాలను పెండింగ్లో పెట్టడం, ఇంకెవరైనా నిర్వ హిస్తే జరిమానా విధించడం జరుగుతున్నాయి. దీంతో ఒప్పుకున్న మేరకు డబ్బులు చెల్లించాల్సిందే. అలాగే, మూడు రోజులు, దినాలు అనే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో కాటికపాపల, గంగిరెద్దులు కులస్తులకు డబ్బులు చెల్లించాలి. అంత్యక్రియలు ముగిసేనాటికి రూ.లక్షల్లో ఖర్చు వస్తుంది. లేకపోతే అంత్యక్రియలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాం టి ఘటనలు రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామా ల్లో జరిగినట్లు పలువురు వివరిస్తున్నారు.