ఆ శ్మశానాల్లో చితులు సిద్ధం.. మరణమే ఆలస్యం

by Sridhar Babu |
cemetery
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభించి, రోజూ అధిక స్థాయిలో మరణాలు సంబంధించడం నిత్యకృత్యంగా మారిందా? ఇందుకు శ్మశాన వాటికలు అన్నింటికి సిద్ధం చేసి ఉంచారా? అంటే అవుననే అంటున్నాయి అక్కడ సాక్షాత్కరించిన దృశ్యాలు. సెకండ్ వేవ్ కరోనాతో మరణ మృదంగం జరుగుతోందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అవసరం లేదు. కరీంనగర్‌లోని ఓ శ్మశాన వాటికలో జరుగుతున్న తంతును పరిశీలిస్తే అసలేం జరుగుతోందో అర్థం కావల్సిందే.

అడ్వాన్స్‌గా చితులు సిద్ధం..

కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతున్న ఘటనలు ప్రస్తుతం సర్వ సాధరణంగా మారాయి. దీంతో శ్మశాన వాటికల్లో అడ్వాన్స్‌గా చితులను సిద్ధం చేసి ఉంచుతున్నారు నిర్వహకులు. డెడ్ బాడీ వచ్చిందంటే చాలు చివరి తంతు పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా సిద్దం చేసి ఉంచుతున్నారు. కరీంనగర్‌లోని బొమ్మకల్ బైపాస్ రోడ్డు మానేరు తీరంలో శ్మశాన వాటికలో కరోనా మరణాల కోసమే ప్రత్యేకంగా చితులు రెడీ చేసి పెడుతున్నారు. ఆస్పత్రి నుండి డెడ్ తీసుకొస్తున్నారని సమాచారం రాగానే చితికి నిప్పంటించేందుకు అవసరమైన సరుకులను సిద్ధం చేసి ఉంచుతున్నారు. అంబులెన్స్‌లో నుండి శవాన్ని దింపి నేరుగా చితిపై పెట్టి వెంటనే కాల్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

Next Story