ఆన్‌లైన్ విద్యకు అడుగడుగునా అడ్డంకులే..

by  |
ఆన్‌లైన్ విద్యకు అడుగడుగునా అడ్డంకులే..
X

నేటి నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. వారానికి మూడు రోజులు ఒక్కో తరగతికి విద్యా బోధన చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రతి విద్యార్థి ఆన్​లైన్ ​పాఠాలు వినేలా ఉపాధ్యాయులే బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఉపాధ్యాయులు ఎంత మంది విద్యార్థుల వద్ద ఫోన్లు ఉన్నాయో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించిన పేరెంట్స్​మీటింగ్​లో భిన్నాభిప్రాయాలను వెలుబుచ్చారు. దీంతో ఆన్​లైన్​బోధనపై ఇటు విద్యార్థులు, అటు టీచర్లకు గందోరగోళ పరిస్థితి నెలకొంది.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి:

రంగారెడ్డి జిల్లాలో 1,22,808 మందికి, వికారాబాద్ జిల్లాలో 64,544 మంది విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు బోధించాల్సి ఉంది. వీరందరికీ ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్లు ఉండాల్సిందే. లేకపోతే విద్యా బోధనకు అడ్డింకిగా మారబోతుంది. రంగారెడ్డిలో 5,974, వికారాబాద్​లో 4672 మందికి టీవీ, మోబైల్ సౌకర్యం అందుబాటులో లేదని జిల్లా విద్యాశాఖాధికారులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కానీ, మోబైల్, టీవీలున్నప్పటికీ సిగ్నల్ లేని గ్రామాలపై సర్వే చేయడంలో విఫలమయ్యారు.

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని అనేక గ్రామాల్లో మోబైల్ నెట్వర్క్ టవర్లున్నప్పటికీ సిగ్నల్ అందడంలో ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క రి ఇంటిలో టీవీలు ఉండవచ్చు. కానీ ఆ టీవీలు వచ్చేందుకు లోకల్ నెట్​వర్క్, డీటీహెచ్, కేబు ల్ కనెక్షన్లు వాడుతున్నారు. చాలా గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. దీంతో డీటీ హెచ్, కేబుల్ కనెక్షన్లు పనిచేయకుండా చేస్తు న్నాయి. దీంతో విద్యార్థులకు బోధన కష్టతరం గా మారనుంది. అంతేకాకుండా పల్లెల్లో విద్యు త్ కోతలు అధికంగానే ఉన్నాయి. ఇన్ని సమ స్యల నడుమ ఆన్​లైన్​బోధనపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఎస్ఎంసీలో వెల్లడైన అనుమానాలు..

ఈ నెల1వ తేదీ నుంచి విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో మెజార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వమే ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్, ట్యాబ్, గ్రామ పంచాయతీకి ఒక ఎల్ఈడీ టీవీతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులకు వివరించారు. ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు తీసుకునే పరిస్థతి లేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో ఆన్ లైన్​ తరగతులు నిర్వహిస్తున్నారు కానీ, గ్రామా ల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదని, సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు.

ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్​తో పాటు మొబైల్ నెంబర్​ను టీశా ట్ యాప్ డౌన్​లోడ్​ చేసుకుని అప్డేట్​చేయాలి. అందులో నమోదు చేసేటప్పుడు సమీప బంధు వుల నెంబర్లతో చేసుకున్నట్లు తెలుస్తోంది. బోధ న ప్రారంభమైనప్పుడు ఆ మొబైల్ విద్యార్థికి అందుబాటులోఉండదు. ఈ సమస్యలను పరిష్క రించేది ఎవరని ఉపాధ్యాయులను తల్లిదండ్రు లు ప్రశ్నించారు. విద్యార్థులకు డౌట్ వస్తే టీచ ర్లను సంప్రదించాలి. విద్యార్థి ఒక చోట, పిల్లలు మరోచోట ఉన్నప్పుడు ఏవిధంగా పరిష్కారిస్తారని ఇలా ఎన్నో అనుమానాలను తల్లిదండ్రులు లేవనెత్తారు.

మా గ్రామంలో నెట్​వర్క్​లేదు..

ఎక్వాయిపల్లిలో మొబై ల్ ఉన్నా ఫలితం లేదు. సిగ్నల్ కోసం కడ్తాల్ మండల కేంద్రం వరకు వెళ్లా ల్సిందే. నేటి నుంచి విద్యార్థులకు ఆన్ లైన్​ క్లాసులు ప్రారంభమైతే పాఠాలు ఏవి ధంగా వింటారోనని ఆందోళన కలుగుతుంది. టీవీలకు డీష్ కనెక్షన్లు ఉన్నప్పటికీ కోతల బెడదతో ఇబ్బంది పడుతు న్నాం. వారానికి రెండు రోజులు డిష్ రి పేర్ చేయాల్సి వస్తోంది.


–శ్రీశైలం, ఎక్వాయిపల్లి

స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలి..

తండాల్లో, మారు మూ ల ప్రాంతాల్లోని గూడే ల్లో టీవీలు, మొబైల్ ఫోన్లు లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ఇద్దరికి వేర్వేరుగా మొబైల్ ఇప్పించడం కష్టంగా ఉంది. ప్రభుత్వమే ప్రతి విద్యార్థికి మొబైల్, కంప్యూటర్ లాం టి పరికరాలను అందజేయాలి. అప్పుడే విద్యార్థులందరూ ఆన్​లైన్​పాఠాలు వినేం దుకు అవకాశం ఉంటుంది.

–ఉమ, కడ్తాల్


Next Story

Most Viewed