స్వాత్రంత్ర సమరయోధుడు విరాళం

by vinod kumar |
స్వాత్రంత్ర సమరయోధుడు విరాళం
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ నివారణకు నర్సంపేటకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పెండెం రాజయ్య తన వంతు ఆర్థిక సాయం చేయడానికి ముందుకువచ్చారు. తన నెల పింఛను (రూ.29,900) చెక్కు రూపంలో ఆంధ్రా బ్యాంకు యాజమాన్యం వారి సహకారంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. తాను గతంలో స్వాతంత్ర్య సమరయోధునిగా దేశానికి సేవలందించాననీ, ఎమ్మెల్యే నిన్న ప్రకటించిన రెండు నెలల వేతనం (రూ. 5 లక్షల 50 వేలు) తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని రాజయ్య తెలిపారు. కరోనా నివారణకు సహృదయంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పెండెం రాజయ్యను ఎమ్మెల్యే అభినందించారు. ఇదే స్ఫూర్తితో నర్సంపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య కోసం, కరోనా వైరస్ నివారణకు దాతలు స్వచ్చంధంగా ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

tags:freedom fighter, CMRF, coronavirus, pension

Advertisement

Next Story