రామన్నపేటలో విషాదం.. స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

by Shyam |   ( Updated:2021-10-21 10:51:24.0  )
Freedom fighter Vemavaram Manohar Panthulu
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఆంగ్లేయుల కాలంలో అనేక పోరాటాల్లో పాల్గొన్న ఆయన మృతిని రామన్నపేట మండల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రామన్నపేట మండలంలో జెడ్పీటీసీగా పనిచేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. ఆయన మరణవార్త తెలిసిన వివిధ పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story