రేషన్ దుకాణాల్లో ఉచితంగా కందిపప్పు

by Shyam |
రేషన్ దుకాణాల్లో ఉచితంగా కందిపప్పు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ మే, జూన్ నెలలకు సంబంధించి రెండు కిలోల కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు నెలలకు కలిపి 17,509.14 మెట్రిక్ టన్నుల కందిపప్పు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ప్రతీ నెలకు కేంద్ర అవసరాలకు 5329.38 టన్నులు, రాష్ట్ర వాటాగా 3425.18 టన్నులు ఉంటాయి. మిల్లర్ల నుంచి కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి పప్పును ఎంఎల్ఎస్ పాయింట్ల వరకూ తరలించేవరకూ చూసేందుకు ఆరుగురు సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. మార్కెటింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. టీఎస్ మార్క్‌ఫెడ్ ఎండీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా హార్టికల్చర్ డైరెక్టర్, అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్, నాఫెడ్ బ్రాంచ్ మేనేజర్, సీ&ఏడీ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సర్వీస్ ఛార్జి కింద మొత్తం కందిపప్పు కొనుగోలుకు అవసరమైన ఖర్చులో రెండు శాతం చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు.

Tags: Telangana, Mla, ration shops, Redgram, LOCKDOWN, free

Advertisement

Next Story

Most Viewed