న్యాయవాదులకు ఉచిత వైద్య శిబిరం

by Sridhar Babu |
health-camp-at-shadhnagar1
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో శ్రీసాయికంటి ఆసుపత్రికి చెందిన లయన్ అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్‌లకు డయాబెటిస్ డిటెక్షన్ క్యాంప్, కాంటినెంటల్ హాస్పిటల్ న్యూరో క్యాంపులను ఏర్పాటు చేశారు. న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు 30 మందిని పరీక్షించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజ్యలక్ష్మి, ఆశారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్, సభ్యులు సబియా సుల్తానా, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, లయన్ సభ్యులు మనోహర్ రెడ్డి, సుధాకర్, శివనాగయ్య, శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story