- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరాశ్రయులకు అన్నదానం.. వసతి
దిశ, ఖమ్మం: లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అనాథలు, భక్తులు, వలస కార్మికులకు భద్రాచలంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి అన్నదానం చేశారు. వీరందరికీ ప్రతిరోజూ రెండు పూటల భోజనం, అల్పాహారం, వసతి కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. తన బియస్ఆర్ గార్డెన్స్‌లోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో ఉచిత వసతి కల్పిస్తానని చెప్పారు. దీనిని భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకులు శ్రీమాన్ పొడిచేటి జగన్నాదాచార్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శంకర్ రెడ్డితో పాటు అన్నదానానికి సహకరిస్తున్న దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ రమేష్, కావూరి ప్రభాకర్, గంజి సంపత్, కాకరాల శ్రీనివాసశర్మ, కిరణ్, బిందు ప్రభాకర్, హసీనా నూర్జహాన్, తదితరులు పాల్గొన్నారు.
tags:coronavirus, lockdown, busireddy seetharami reddy charitable trust, busireddy shankar reddy, free meals, annapurna function hall