- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి పేరుతో మోసం.. ట్రైనీ ఐఏఎస్‌పై కేసు నమోదు
దిశ, కూకట్‌పల్లి: ట్రైనీ ఐఏఎస్, వైరా మాజీ ఎమ్మెల్యే మధన్‌లాల్ కుమారుడు మృగేందర్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృగేందర్ ప్రస్తుతం చెన్నైలోని మధురైలో ట్రైనీ ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎర్లపూడి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బానోత్ మధన్‌లాల్ కుమారుడు మృగేందర్ లాల్, దూరపు బంధువును అవుతానంటూ ఫేస్‌బుక్‌లో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యాయని యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన పుట్టినరోజున రాత్రి సమయంలో సదరు యువతికి ఫోన్ చేసి ఫ్రెండ్ రూమ్‌కి పిలిపించుకొని బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏడాదిపాటు సాగిన ప్రేమాయణం అనంతరం పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. అనంతరం ఐఏఎస్ ట్రైనింగ్ కోసం సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చేరాడు. ఆ తర్వాత కూకట్‌పల్లిలోని యువతి ఇంటికొచ్చి, కుటుంబసభ్యులకు విషయం చెప్పి, ఆ యువతిని బయటకు తీసుకెళ్లాడు. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో భోజనం చేసి, అకాడమీ చూపిస్తానని తీసుకెళ్లాడు.
గంటపాటు అకాడమీలో తిరిగి, రెస్ట్ తీసుకుందామని రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. దీంతో యువతి మృగేందర్ నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లింది. మళ్లీ కొద్దిరోజుల అనంతరం యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరోసారి లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రీ నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో ట్రైనింగ్ వెళ్లాడు. ఏప్రిల్ 2021లో మృగేందర్ మధురై జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ క్రమంలో ట్రైనింగ్‌లో పరిచయమైన మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన సదరు యువతి మృగేందర్‌ను నిలదీసింది. దీంతో మృగేందర్‌తో పాటు అతడి తండ్రి మదన్ లాల్ సైతం యువతిపై బెదిరింపులకు దిగారు. తన కొడుకు పెళ్లికి అడ్డొస్తే చంపేస్తానని మదన్ లాల్ యువతిని బెదిరించడం ప్రారభించారు.
అనంతరం బంధువైన ఓ పోలీస్ అధికారి సాయంతో యువతిపై తప్పుడు కేసులు బనాయించి, ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్, ఐప్యాడ్ లాక్కున్నారు. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో చేసేదేంలేక ఆ యువతి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి సీఐ నరసింగరావు పలు సెక్షన్ల కింద మృగేందర్, అతడి తండ్రి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌పై కేసు నమోదు చేశారు. కాగా, కేసు నమోదు చేసి నెల గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.