జూన్‌లో పుంజుకున్న విదేశీ పెట్టుబడులు

by Harish |
జూన్‌లో పుంజుకున్న విదేశీ పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) జూన్ నెలలో మెరుగైన కొనుగోళ్లను నిర్వహించారు. గత రెండు నెలల ధోరణి తిప్పికొడుతు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రూ. 13,269 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయంగా కరోనా కేసులు తగ్గడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని, ఆర్థికవ్యవస్థలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశలతో విదేశీ పెట్టుబడిదారులు నిధుల కొనసాగిస్తున్నట్టు నిపుణులు తెలిపారు.

మెరుగైన త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలతో పాటు, దీర్ఘకాలిక సానుకూల ఆధార వృద్ధి కారణంగా భారత ఈక్విటీలపై ఎఫ్‌పీఐల ఆసక్తికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ పెట్టుబడిదారులు గత నెలలో మొత్తం రూ. 17,215 కోట్లను ఈక్విటీల్లోకి మళ్లించారని, ఇందులో డెట్ విభాగంలో రూ. 3,946 కోట్లను ఉపసంహరించుకున్నట్టు డిపాజిటరీ గణాంకాలు స్పష్టం చేశాయి. దీంతో సమీక్షించిన నెలలో నికరంగా రూ. 13,269 కోట్ల ఎఫ్‌పీఐలు వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్‌లో రూ. 9,435 కోట్లు, మేలో రూ. 2,666 కోట్ల ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీల్లోకి వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed