మంజీరా నది దాటుతూ నలుగురు మృతి

by Sumithra |   ( Updated:2021-06-25 23:54:19.0  )
మంజీరా నది దాటుతూ నలుగురు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మంజీర నది దాటుతూ నలుగురు గల్లంతయ్యారు. శుక్రవారం గల్లంతు కాగా.. శనివారం ఉదయం మృతదేహలు నీటిపై తెలడంతో ఈ విషయం వెలుగు చూచింది. ఈ సంఘటన బీర్కూర్ -బిచ్కుంద సరిహద్దు శెట్లూరు వద్ద జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. బిచ్కుంద మండలం శెట్లూరుకు చెందిన అంజవ్వ (42), ఆమె కూతురు సోనీ (18), అంజవ్వ మరిది మారుతీ కూతురు గంగోత్రి, ప్రశాంత్ (9)లు శుక్రవారం ఉదయం బీర్కూర్‌లో గాయపీర్ల ఉత్సవానికి వెళ్లారు. శెట్లూరు గ్రామస్తులు మంజీరా నదిలో నడిచి బీర్కూర్ వెళ్లడం అలవాటు.

Read More: మాస్క్ పెట్టుకొని భర్త.. భార్య ముందే అలా చేసిన సెక్యూరిటీ గార్డ్

శుక్రవారం సైతం నలుగురు నది దాటి వెళ్లడం కోసం వెళుతూ ఇసుక కోసం తవ్విన ప్రాంతంలో లోతు తెలియక నలుగురు మునిగిపోయారు. శనివారం ఉదయం అంజవ్వ, ప్రశాంత్, సోనిల మృతదేహాలు బయటకు నీటిపైకి తెలడంతో గ్రామస్తులు గాలింపు చేపట్టారు. గంగోత్రి మృతదేహం కోసం గాలిస్తున్నారు. నలుగురు నీట మునిగి మృతి చెందడంతో శెట్లోర్ లో విషాదం అలుముకుంది. రెండు కుటుంబాల్లో నలుగురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story