బ్రాంక్స్ జూలో మరో ఏడు జంతువులకు కరోనా

by vinod kumar |
బ్రాంక్స్ జూలో మరో ఏడు జంతువులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో మరో నాలుగు పులులు, రెండు సింహాలకు కరోనా వైరస్ సోకినట్లు నేషనల్ జియోగ్రఫీ తెలిపింది. మూడు వారాల క్రితం ఇదే జూలో ఒక పులికి కరోనా సోకిందని, మరో ఆరింటిలో లక్షణాలు కనిపించాయని జూ సిబ్బంది ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో సందర్శకులను నిలిపివేసిన 11 రోజుల తర్వాత మార్చి 27న నాడియా అనే పులికి కరోనా లక్షణాలు కనిపించాయి. దానికి టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది.

అయితే జూ కీపర్ నుంచి జంతువులకు ఈ వైరస్ సోకినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు జూ అధికారులు తెలిపారు. ఇప్పుడు మొత్తం ఏడు జంతువుల్లో లక్షణాలు కనిపిస్తుంటే వాటికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా వాటి మలాన్ని పరీక్ష చేయడం ద్వారా కరోనా పాజిటివ్ అని నిర్ధారించినట్లు వారు వెల్లడించారు. అంతేకాకుండా రెండు పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు అమెరికా వెటర్నరీ శాఖ తెలియజేసింది. అయితే మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ సోకినా , జంతువుల నుంచి జంతువుకు ఈ వ్యాధి సోకిన జాడలు లేవని అమెరికా అధికారులు నమ్ముతున్నారు.

Tags:Corona, covid, tigers, corona america, new york, bronxx zoo, pet animals

Advertisement

Next Story

Most Viewed