అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భవతి ఆత్మహత్య

by Sumithra |
అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భవతి ఆత్మహత్య
X

దిశ, చార్మినార్ : మూడవ కాన్పులోనూ తనకు కొడుకు కాకుండా మళ్లీ కూతురు పుడితే తలాక్ ఇస్తానని భర్త వేధిస్తుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడి భరించలేక నాలుగు నెలల గర్భవతి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాతబస్తీ కామాటిపురా పోలీస్​స్టేషన్​పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. కామాటిపురా ఇన్​స్పెక్టర్​ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం … ముర్గీ చౌక్​ ప్రాంతానికి చెందిన ఆమీర్​ (25 )కు మొయిన్​ పురా ప్రాంతానికి చెందిన రుబీనాబేగం (22)తో మూడున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు సంతానం. అదనపు కట్నం కావాలని భర్త, అత్త, మామలు తరచు వేధించేవారు. మొట్ట మొదట కూతురు పుట్టినప్పటి నుంచి నాకు కొడుకు కావాలే … కూతురు వద్దని భార్య రుబీనా బేగంను మానసింకంగా, శారీరకంగా హింసించేవాడు.

రెండవ సారి కూడా కూతురు పుట్టడంతో రుబీనా బేగంకు అత్తింటి వారితో వేధింపులు అధికమయ్యాయి. మూడవ సారి భార్య రుబినా బేగం రెండునెలల గర్భవతి అని తెలియగానే లింగనిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని, ఒక వేళ ఆడ బిడ్డ అయితే వెంటనే అబార్షన్​ చేయించుకోవాలని వేధించ సాగాడు భర్త ఆమీర్. లింగ నిర్దారణ పరీక్షలకు భార్య ససేమిరా అనడంతో భర్త రెండు నెలల గర్భవతి ఉన్నపుడే పుట్టింటికి వెళ్లగొట్టాడు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతిగా ఉన్న రుబీనా బేగంను అత్తింటి వారు కాని, భర్త గాని రాకపోవడంతో పాటు ఫోన్​లో వేధించడం మొదలు పెట్టారు. ఈ సారి మళ్లీ బిడ్డ పుడితే తలాక్ (విడాకులు) ఇస్తానని బెదిరంచడంతో రుబీనా బేగం తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యింది. అంతేకాకుండా పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులు తిరిగి పంపిస్తానని బెదిరించేవారు.

అటు అత్తింట్లో సుఖం లేకుండా ఇటు అమ్మగారింట్లో ఉన్నా ఫోన్​లో అత్తా, భర్త వేధిస్తున్నారని శనివారం ఉదయం 7గంటల సమయంలో గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకుని రుబీనా బేగం ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం వరకు కూడా రుబీనా బేగం బయటికి రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టిన కుటుంబసభ్యులకు రుబీనా బేగం విగత జీవిలా కనిపించింది. మృతురాలి తల్లి మెరాజ్​ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామాటి పురా పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మెరాజ్​ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామాటి పురా పోలీసులు భర్తతో పాటు అత్త, మామలపై కేసులు నమోదు చేశారు.

మొయిన్​పురా​లో విషాధ చాయలు..

అందరితో కలగోపుతత్వంగా ఉండే రుబీనాబేగం అత్తింటి వేధింపులు భరించలేక చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మొయిన్​బాగ్​లో విషాధ చాయలు అలుముకున్నాయి. ఉదయం 8గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అత్తింటి వారు వెట్టి చాకిరి చేయించుకునే వారని, ఎలాంటి ఇంటికి ఇచ్చి నాజీవితం నాశనం చేశావమ్మా ? అని తన బిడ్డ ఎన్నో సార్లు తమకు చెప్పి రోదిస్తున్నా కొన్ని రోజులు సర్దుకో తల్లి అంతా నయం అవుతుందని చెప్పి నచ్చజెప్పామని ఇంతలోని కానరాని లోకాలకు పోయిందని తల్లి బోరున విలపించింది.

Advertisement

Next Story

Most Viewed