- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుప్తనిధుల కోసం తవ్వకాలు.. నలుగురు అరెస్ట్
దిశ, నాగర్ కర్నూల్: గుప్త నిధుల తవ్వకాల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నాగర్‌కర్నూల్ సీఐ గాంధీ నాయక్ తెలిపారు. నాగర్‌కర్నూల్ మండలం మంతటిగుట్ట స్వామి ఆలయంలో గతవారం క్రితం కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. కచ్ఛితమైన సమాచారం మేరకు అదే సమయంలో ఎస్ఐ విజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడిచేశారు. గ్రామానికి చెందిన రాజశేఖర్, పుల్లయ్య, సైదులుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
అక్కడే ఉన్న రెండు కార్లను స్వాధీనం చేసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే వారం క్రితం ఈ సంఘటన జరుగగా, కేసు నమోదుకు అలస్యం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరారీలో ఉన్నవారంతా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారని సమాచారం. పరారీలో ఉన్నవారిని, వాహనాలను కేసు నుండి తప్పించేందుకు మంతనాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.