- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామిల్టన్ అరుదైన ఘనత
దిశ, స్పోర్ట్స్: ఫార్మూలా వన్ రేసర్ లూయిస్ హామిల్టన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్‌లో విజయం సాధించిన అతను ఫార్మూలా వన్‌లో 91 విజయాలను సాధించిన దిగ్గజం మైఖేల్ షూమాకర్ రికార్డును సమం చేశాడు. ఆదివారం జర్మనీలో జరిగిన ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్‌లో హామిల్టన్ సులువుగానే విజయం సాధించాడు.
మెర్సిడిజ్ రేసర్ వాల్టెరి బాటస్ కారు ఇంజిన్ విఫలం కావడంతో రేసును పూర్తి చేయలేకపోయాడు. దీంతో హామిల్టన్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది. ఈ చాంపియన్‌షిప్‌తో అతని ఖాతాలో 69 పాయింట్లు వచ్చి చేరాయి. రేస్ అనంతరం మైఖేల్ షూమాకర్‌కు చెందిన ప్రఖ్యాతిగాంచిన రెడ్ రేస్ హెల్మెట్‌ను హామిల్టన్‌కు దిగ్గజ రేసర్ కొడుకు మిక్ బహూకరించాడు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని హామిల్టన్ అన్నాడు. ‘మైఖేల్ షూమాకర్ రికార్డును ఏ రేసరైనా సమం చేస్తారని ఎవరైనా అనుకున్నారా? నేనైతే అసలు ఊహించలేదు. ఇది వెలకట్టలేని గౌరవం’ అని పేర్కొన్నాడు.