- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5 ట్రిలియన్ల వృద్ధి ఇప్పట్లో సాధ్యం కాదు..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2024-25 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చడానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, ఈ లక్ష్యం 2032-33 నాటికి మాత్రమే సాధ్యమయ్యే అవకాశముందని ప్రపంచ బ్యాంకు మాజీ ముఖ్య ఆర్థిక వేత్త కౌశిక్ బసు అన్నారు. ఓ దినపత్రికలో రాసిన వ్యాసంలో జిడీపీ వృద్ధి ఏ మేరకు ఉందో గమనిస్తే 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని ఏ విధంగానూ 2024-25 నాటికి చేరుకోలేమని స్పష్టంగా తెలుస్తోంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం 2018-19లో స్థూల దేశీయ ఉత్పత్తి 4.5 శాతం రేటుతో పెరుగుతోంది. దేశ జీడీపీ 2.7 ట్రిలియన్స్ వద్ద ఉంది. ప్రస్తుతమున జీడీపీ వృద్ధి 4.5 శాతంతో లెక్కిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 2.87 ట్రిలియన్లకు పెరుగుతుందని ఆయన వివరించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం మధ్య 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే కల నేరవేరే అవకాశంలేదు. లక్ష్యాన్ని సాధించాలంటే, ఇటీవలి కాలంలో కనిపించిన పనితీరు కంటే దేశం వేగంగా వృద్ధి చెందాలి. స్పష్టమైన వృద్ధి రేటును లెక్కించాలి. అంటే, కనీసాం వృద్ధి రేటు 10.48 శాతం లేదంటే 10.5 శాతంగా ఉండాలి. ఇంకా ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ అవసరం. అందుకు తగిన లక్ష్యాన్ని సాధించే వివరాలను తెలియజేయాలి. అంతర్జాతీయ పరిశీలకులకు, ముఖ్యంగా పెట్టుబడిదారులకు వృత్తికి సంబంధించి సందేహాలను సృష్టించకూడదని కౌశిక్ బసు చెప్పారు.
ఇండియా పాత రికార్డులను గమనిస్తే కొన్ని మార్గాలకు పరిష్కారాలు దొరుకుతాయి. 1947 నుంచి ఇప్పటివరకూ దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటుని నమోదు చేసింది చాలా తక్కువ సార్లు. విశేషమైన వృద్ధి 2007-8లో నమోదైంది. ఆ ఏడాది దేశంలో భారీ ఎఫ్‌డీఐలు వచ్చాయని కౌశిక్ చెప్పారు.