ఆస్పత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు

by vinod kumar |   ( Updated:2021-10-14 23:29:25.0  )
bill-clinton1
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆస్పత్రిలో చేరాడు. ఇందుకు సంబంధించి ఏంజెల్ యురేనా ట్వీట్ చేశారు. ‘అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిల్ క్లింటన్.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో ఉన్న ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మొదటగా ఆయనకు కరోనా అనుకున్నారు. కానీ, కరోనా సోకలేదు. అతనికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి చాలా కృతజ్ఞతలు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. 1993 నుంచి 2001 వరకు క్లింటన్ అమెరికా 42వ అధ్యక్షుడిగా పనిచేశారు. 58 ఏళ్ల వయస్సులో 2004 లో గుండె జబ్బుకు సంబంధించి ఆయన బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నారు.

Advertisement

Next Story