- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీమంత్రి భార్య దారుణ హత్య.. రాత్రి ఇంట్లోకి దూరి ఆమెపై..
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కేంద్ర మాజీమంత్రి పీఆర్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం (67) మంగళవారం రాత్రి తన నివాసంలో హత్యకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. దిండుతో గట్టిగా నొక్కి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కుమారమంగళం ఇంట్లో ధోబీగా(చాకలి) పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాలలోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ లో ఉంటున్న కిట్టి కుమారమంగళం ఇంటికి మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ధోబీ రాజు వచ్చాడు. అతనితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు తలుపు తీసిన పనిమనిషిపై మత్తు మందు చల్లి ఆమెను స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం కిట్టి కుమారమంగళం గదిలోకి వెళ్లి ఆమె ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి పరారయ్యారు. రెండు గంటల తరువాత మేల్కున్న పనిమనిషి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చేసరికి బెడ్ పై కిట్టి కుమారమంగళం విగతజీవిగా పడిఉన్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి ధోబీ రాజును అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కిట్టి కుమారమంగళంలోని విలువైన వస్తువులు, డబ్బు దొంగతనం చేసే క్రమంలో వారు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కిట్టి కుమారమంగళం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆమె భర్త పీ రంగరాజన్ కుమారమంగళం పివీ నరసింహారావు ప్రభుత్వంలో 1991-92 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 1998లో ఆయన విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరి కుమారుడు రంగరాజన్ మోహన్ కుమారమంగళం కాంగ్రెస్ లో చేరారు. ఇక తల్లి మరణ వార్త తెలుసుకున్న రంగరాజన్ మోహన్ కుమారమంగళం బెంగుళూరు నుంచి వెంటనే ఢిల్లీకి బయలుదేరారు