- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోల్ స్కామ్‌లో కేంద్ర మాజీ మంత్రి దోషి
న్యూఢిల్లీ: ఎన్‌డీఏ సర్కారులో కేంద్ర మంత్రిగా పనిచేసిన దిలీప్ రే బొగ్గు కుంభకోణంలో దోషిగా తేలారు. 1999లో జార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసును ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు విచారించింది. ఈ కేసులో అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతల్లో ఉన్న దిలీప్ రేను నేరపూరిత కుట్ర, ఇతర నేరాల్లో దోషిగా తేల్చింది. ఈయనతోపాటు ఆ శాఖలో అప్పుడు సేవలందించిన సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతం, కాస్ట్రన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్), ఈ సంస్థ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా, కాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్‌లనూ దోషులుగా నిర్ధారించినట్టు స్పెషల్ జడ్జి భరత్ పరషార్ తీర్పునిచ్చారు. శిక్ష పరిమాణంపై ఈ నెల 14న విచారించనున్నట్టు వెల్లడించారు. ఈ కేసు జార్ఖండ్ గిరిదిహ్‌లోని బొగ్గు గనిని సీటీఎల్‌కు 1999లో కేటాయించినదానికి సంబంధించినది.