మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కన్నుమూత

by Anukaran |
former telangana minister azmeera chandulal
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌(66) గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన మూడ్రోజుల కిందట హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మారుమూల గిరిజ‌న గ్రామంలో జ‌న్మించిన ఆయ‌న రాజ‌కీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. స‌ర్పంచ్ స్థాయి నుంచి కేబినెట్ మినిస్టర్‌గా కూడా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న సొంతం. ఎన్టీఆర్‌, కేసీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు శాసనసభకు, రెండుసార్లు లోక్‌సభకు చందూలాల్‌ ఎన్నికవ‌డం గ‌మ‌నార్హం. 2014 లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు.

చందూలాల్‌ మృతిపై రాష్ట్ర గిరిజ‌న నేత‌ల‌తో పాటు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఆయ‌న అభిమానులు, అనుచ‌రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ప‌లువురు రాజ‌కీయ ప్రముఖులు ఆయ‌న కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేగాకుండా.. చందూలాల్ మృతి పట్ల సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన చందూలాల్ సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. అనంతరం వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed