కరోనాతో మాజీ సీఎం కన్నుమూత

by Sumithra |
కరోనాతో మాజీ సీఎం కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కాటుకు ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు బలవుతున్నారు. తాజాగా రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా (89) కరోనాతో గురువారం ఉదయం కన్నుమూశారు. ఈయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈయన హరియాణా, బిహార్ గవర్నర్ గా పనిచేశారు. జగన్నాథ్ పహాడియా 1980 నుంచి 1981 వరకు సీఎంగా ఉన్నారు. పహాడియా మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి మరణంపై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు సంతాప దినం ప్రకటించింది.

Advertisement

Next Story