- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభ బరిలో హెచ్‌డీ దేవేగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ కర్ణాటక నుంచి రాజ్యసభ బరిలోకి దిగనున్నారు. ఈ నెల 19న జరగనున్న పోలింగ్ కోసం మంగళవారం నామినేషన్ వేయనున్నట్టు ఆయన తనయుడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర జాతీయ నాయకుల అభ్యర్థనల మేరకు దేవేగౌడ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. ప్రతిఒక్కరి విజ్ఞప్తులను మన్నించినందుకు ధన్యవాదాలని ట్వీట్ చేశారు. ప్రధానిగా సేవలందించిన దేవేగౌడ తన రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందారు. కొన్ని సార్లు ఓటమినీ చవిచూశారు. అటువంటి దేవేగౌడను రాజ్యసభకు పంపించేందుకు ఒప్పించడం మహాకార్యమేనని తెలిపారు. ఎట్టకేలకు ఆయన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించారని, రాజ్యసభలో రాష్ట్రం నుంచి టాప్ ప్రతినిధిగా ఆయన ఉంటారని వివరించారు.