కేసీఆర్ శేష జీవితం చర్లపల్లిలోనే: పొన్నాల

by Shyam |
కేసీఆర్ శేష జీవితం చర్లపల్లిలోనే: పొన్నాల
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకుంటున్నారని, జనాన్ని నమ్మించడం కోసం తూతూమంత్రంగా నీటిని పంపింగ్​ చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ అవినీతి బయట పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఆదివారం పంపులు స్టార్ట్ చేసి.. 10 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తామనడం, కాళేశ్వరం అవసరమని నమ్మించేందుకు దౌర్భాగ్యపు పనులు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరులలో పూర్తిస్థాయిలో నీరు ఉందని, ఇప్పుడు కాళేశ్వరం నీరు అవసరం లేదని, కేవలం ప్రాజెక్టు కట్టామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

సామాన్య ప్రజలను నమ్మించడానికి అవసరం లేకపోయినా పంపింగ్ చేస్తున్నారని, మూడేళ్లుగా కాళేశ్వరం నుంచి ఒక్క చుక్కనీరు ఉపయోగపడలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని నిరూపిస్తానని, దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్​ శేష జీవితం చర్లపల్లి జైల్లోనే ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే భూగర్భ జలాలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 16 టీఎంసీలకే భూగర్భ జలాలు పెరిగితే సాగర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల కింద ఎంత మేరకు పెరగాలని, వనపర్తి, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పెరిగాయని, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందా అని పొన్నాల ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed