కాంగ్రెస్ సభలో అపశృతి.. సభాప్రాంగణానికి వెళ్తూ ఒకరు మృతి

by Sridhar Babu |
Ex MPTC
X

దిశ, ఓదెల: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో జరిగిన ఓ ఘటన పెద్దపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో గండ్ర సత్యనారాయణ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సభకు హాజరయ్యేందుకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ గోళి సత్యనారాయణ గుండెపోటుకు గురై మృతిచెందారు. సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గోళి సత్యనారాయణ గుండెపోటుకు గురై అక్కకడిక్కడే చనిపోయారు.

అప్పటి వరకు తమతో సరదాగా మాట్లాడిన సత్యనారాయణ కుప్పకూలి పడిపోవడంతో సహచర కాంగ్రెస్ నాయకులు ఆందోళణకు గురయ్యారు. ఆయన చనిపోయారని నిర్దారించిన తరువాత కాంగ్రెస్ పార్టీతో పాటు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి నుండి ఉల్లాసంగా వెళ్లిన సత్యనారాయణ విగతజీవిగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story