‘ఎమ్మెల్యే వెళ్లేది కూడా ఈ దారి నుంచే.. దయచేసి రోడ్డు వేయండి’

by Shyam |
Former MLA Kommuri Pratap Reddy
X

దిశ, జనగామ: జనగామ నియోజకవర్గంలో రోడ్లు బాగు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జనగామ ఎమ్మెల్యే నిధుల నుండి అయినా.. రోడ్ల మరమ్మతులు చేపట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాన్నారు. నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయని, గ్రామాల్లో తిరిగే ఎమ్యెల్యే ముత్తిరెడ్డికి ప్రజల ఇబ్బందులు కనపడటం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని బచ్చన్నపేట నుండి చేర్యాలకు వెళ్లే డబుల్ రోడ్డు, నర్మెట్ట నుండి వెల్దండ గ్రామానికి వెళ్లే రోడ్డు, వంగపల్లి, అమ్మాపురం రోడ్లు, చేర్యాల నుండి కడవేరుగు గ్రామాలకు వెళ్లే రోడ్డు కూడా చిన్న వర్షాలకు ఆగమాగం అవుతున్నాయని అన్నారు. హుస్నాబాద్ రోడ్డు, అలాగే కల్వర్టులను మరమ్మత్తు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.

గతంలో రోడ్లమీద పడ్డ గుంతలు చిన్న వర్షానికే గుంతలమయం అవుతోందని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అంతేగాకుండా.. ఈ రోడ్డుపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నాసిరకంగా వేయడం ద్వారా ఇలా వర్షానికే గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్య పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే హనుమంతపూర్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాలంటే ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలనీ, ఇలాంటి రోడ్డుపై ప్రయాణం చేయడం ఎమ్మెల్యేకు కూడా ప్రమాదమే అని అన్నారు. ‘దయచేసి సొంత నిధులతో అయిన రోడ్డు మరమ్మత్తుల చేయించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed