- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Julakanti Rangareddy: కరోనా పేరుతో వాళ్లు బాగా దండుకుంటున్నరు.. మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
దిశ, నల్లగొండ: కరోనా మమమ్మారిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలం అయ్యాయని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శనివారం నిర్వహించిన సీపీఐఎం నల్లగొండ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… గత ఏడాదికాలంగా కరోనా విస్తరిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు దీనిని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.
వ్యాక్సిన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో తీసుకుని ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలకు సప్లై చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. కరోనా పేరుతో కార్పొరేట్ వైద్యశాలలు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌తో పాటు బ్లాక్, వైట్ పంగస్ విస్తరిస్తున్నా ప్రభుత్వాలు నివారించడానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
కొవిడ్‌తో మరణించిన పేదలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేరళ తరహాలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. సీపీఐఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. అనంతరం సీపీఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… రబీలో వచ్చిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి, రైతులకు డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్‌తో మరణించిన జర్నలిస్టులకు, డాక్టర్లకు, పోలీసులకు, శానిటేషన్ సిబ్బందికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కొవిడ్‌లో అత్యవసర సేవలు చేస్తున్న వారందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోటి రూపాయల బీమా చేయాలని కోరారు.