- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ది ఓట్ల రాజకీయం: శ్రీధర్ బాబు
దిశ కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలివెల మండలంలోని కిష్టంపేట గ్రామంలో ఆదివాసుల ఇళ్లను కూల్చివేయడం పట్ల మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. శుక్రవారం అటవీశాఖ అధికారులు మండలంలోని కిష్టంపేట గ్రామంలో ఆదివాసులు నిర్మించుకున్న 70 గుడిసెలను అమానుషంగా కూల్చేశారు. ఈ సంఘటన పై శ్రీధర్ బాబు దిశ తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక వైపు అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూములను సాగుచేసుకుంటున్న వారికి హక్కు పత్రాలు కల్పిస్తానని హామీ ఇస్తునే.. మరోపక్క ఆదివాసులు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు.
గిరిజనులపై తెరాస ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేస్తుందని అన్నారు. 70 కుటుంబాల వారికి నష్టపరిహారం తో పాటు ధ్వంసమైన ఫర్నిచర్ మూల్యం చెల్లించాలి అని, వారికి కొత్తగా గృహాలు నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దళిత గిరిజనుల బలహీన వర్గాల వారికి అండగా ఉంటుందని అన్నారు.