- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి వెళ్లింది మ్యాచ్ ఫిక్సింగ్ కోసమే.. కేసీఆర్‌పై దామోదర్ రెడ్డి ఆగ్రహం
దిశ, పెన్‌పహాడ్: ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శించారు. శనివారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో ‘‘కళ్లాల్లోకి కాంగ్రెస్’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. రెండోసారి ప్రధాని అయ్యాక మోడీ, రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలాదిమంది రైతులు పనిపోయినా పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో చనిపోయిన రైతులను రూ.3 లక్షల పరిహారం ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్ రాష్ట్రానికి ఏం కావాలని డిమాండ్ చేశారో బయటకు చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి రైతులకు ద్రోహం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామానే అని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లాల్లోకి తీసుకొచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఒత్తిడితోనే వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు, యువజన అధ్యక్షులు వెంకన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.