- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా లెక్కలన్నీ సుద్ద తప్పులు : పొన్నాల
దిశ, వెబ్ డెస్క్: కరోనా పై తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ సుద్ద తప్పులని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేబినెట్ సమావేశంలో ప్రాధాన్యత గల అంశాలను విస్మరించారని పొన్నాల మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు అని నాటకాలు ఆడుతున్నారని వివరించారు. ఐటీ విస్తరణ అంటున్న కేసీఆర్, ఐటీఐఆర్, యానిమేషన్ హబ్ ఏమైందో చెప్పాలి? అని ప్రశ్నించారు.
ఇప్పటివరకు కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. 24గంటల విద్యుత్, ప్రాజెక్టుల ద్వారా నీరిస్తే పంటల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు? అని కేసీఆర్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రమ్మంటే పారిపోతున్నారని పొన్నాల ధ్వజమెత్తారు.