- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రైతుల ఉసురు తగిలి ఏపీ ప్రభుత్వం మట్టికొట్టుక పోతది’

X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకమానదని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. తక్షణమే ధాన్యం డబ్బులు చెల్లించి రైతులను ఆదుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలితే మట్టి కొట్టుకుపోతారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాళ్వా ధాన్యం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోకుండా టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పంటలు వేసే సమయం రావడంతో ఇకనైనా రైతులకు బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
Next Story