కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డాడు : ఉమా

by srinivas |
కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డాడు : ఉమా
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు 62 ప్రాజెక్టులు నిర్మించడానికి సంకల్పిస్తే.. ప్రస్తుత సీఎం జగన్ కనీసం 6 ప్రాజెక్టులైనా కట్టగలరా అని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా హైదరాబాద్‌లోని ఆయన ఆస్తులు కాపాడుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో లాలూచీ పడ్డారని విమర్శించారు. పోలవరం ఏడు ముంపు మండలాలపై కేసీఆర్ వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story