- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పంపై ద్వేషంతో రాయలసీమకు నీళ్లు ఆపుతారా !
దిశ, ఏపీ బ్యూరో: జగన్ ప్రభుత్వం వచ్చి 15నెలలైనా గండికోట నిర్వాసితులకు పరిహారం అందించలేదని మాజీమంత్రి దేవినేని ఉమ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం గండికోట ప్రాజెక్ట్‌లో 12టీఎంసీలు నిల్వచేసి, 19న్నర టీఎంసీల వరకు రైతులకు అందించినట్లు గుర్తుచేశారు. ఆనాడు నీటిని నిల్వచేయకుండా ఉండేందుకు జగన్ నిర్వాసితులను రెచ్చగొట్టారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రూ.2లక్షల కోట్లు ఖర్చుచేసినా గండికోట నిర్వాసితులకు డబ్బులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కమీషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను పండబెట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసిందో, వాటి నిర్మాణానికి ఎంతఖర్చుచేసిందో చెప్పగలదా అని నిలదీశారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వాల్సి వస్తుందని, రాయలసీమకు నీళ్ళు ఆపేస్తారా అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడి, కేవలం అప్పులకోసం రైతుల మోటార్లకు మీటార్లు బిగుస్తున్నారని ఆరోపించారు.