- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ నేతలు మట్టిని కూడా వదలడం లేదు : భూమా అఖిలప్రియ
దిశ, ఏపీ బ్యూరో: అక్రమ మైనింగ్, మట్టి, ఇసుక అక్రమ తరలింపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి. విశాఖ-తూర్పుగోదావరి ఏజెన్సీలో అక్రమ మైనింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపిన సంగతి తెలిసిందే. తాజాగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోనూ అక్రమ మైనింగ్ వ్యవహారం గత వారం రోజులుగా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఎర్రమట్టి తరలిపోతుందంటూ ఆరోపణలు చేశారు. ఆదివారం ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డలో యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
నర్సాపురం, కృష్ణాపురంలో ఎస్సీల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శనివారం ఎర్రమట్టి తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లి తవ్వకాలను ఆపివేయించారు అఖిలప్రియ. అయితే సీజ్ చేసిన వాహనాలు వైసీపీ నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని ఆమె అదివారం వెల్లడించారు. వైసీపీ నేతలకే తవ్వకాల అనుమతులు ఇస్తున్నారని విమర్శించిన అఖిల ప్రియ.. వారం రోజుల్లో అక్రమ తవ్వకాలు ఆగకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఈ అక్రమాల్లో భాగం ఉందని భూమా అఖిలప్రియ ఆరోపించారు.