బిగ్ బ్రేకింగ్ : BSPలో చేరికపై మాజీ IAS ఆకునూరి మురళి క్లారిటీ..

by srinivas |   ( Updated:2021-07-31 02:36:54.0  )
akunoori-murali
X

దిశ, వెబ్‌డెస్క్ : తాను బహుజన సమాజ్ వాదీ పార్టీ (BSP)లో చేరుతున్నట్టు గత మూడ్రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు రావడంపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పందించారు. తాను బీఎస్పీలో చేరబోవడం లేదంటూ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రసార, సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా జరిగిన ప్రచారం అంతా తప్పు అని.. దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు.

ఇదిలాఉండగా, తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆకునూరి మురళి లానే వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రవీణ్ కుమార్ బాటలోనే మాజీ ఐఏఎస్ అధికారి మురళి నడుస్తారంటూ పలు కథనాలు రావడంపై ఎట్టకేలకు ఆయన స్పందించి ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed