32మంది ప్రాణత్యాగ ఫలితమే విశాఖ ఉక్కు : చంద్రబాబు

by srinivas |   ( Updated:2021-02-06 05:09:32.0  )
32మంది ప్రాణత్యాగ ఫలితమే విశాఖ ఉక్కు : చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటన చేయడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటికరిస్తే చూస్తు ఊరుకోమని ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత‌ హక్కు. దీనిని ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తే మ‌రో ఉక్కు ఉద్యమం త‌ప్పదు.లక్షలాది మంది ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యమించి,32 మంది ప్రాణ‌త్యాగంతో, అమ‌రావ‌తి వాసి అమృత‌రావు ఆమ‌ర‌ణ నిరాహార దీక్షతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకున్నాం.

గతంలో స్వర్గీయ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయరు?

ఢిల్లీని ఢీకొడ‌తా, మోడీ మెడ‌లు వంచుతాన‌ని ప్రగ‌ల్భాలు ప‌లికే జ‌గ‌న్‌రెడ్డీ.. నీ క్విడ్‌ప్రోకో దోపిడీ బుద్ధిని ప‌క్కన‌బెట్టు. తెలుగువారి ఉద్యమ‌ఫ‌లం, విశాఖ మ‌ణిహారం ఉక్కు క‌ర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీపై ఉందని గుర్తుంచుకో’ అని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story