విషమంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం

by Anukaran |
విషమంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించినట్టు సమాచారం. కరోనా బారినుంచి తప్పించుకున్నా… ఆరోగ్య సమస్యలు ఆయన్ను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2న తేదీన గువాహటిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన అవయవాలు విఫలం చెందాయని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు అస్సాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్మ తెలిపారు.

Advertisement

Next Story