వర్కేషన్ @ వర్క్ ఫ్రమ్ మౌంటెన్స్

by Sujitha Rachapalli |
వర్కేషన్ @ వర్క్ ఫ్రమ్ మౌంటెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వల్ల టూరిజం ఇండస్ట్రీ చాలా దెబ్బతింది. అందుకే ఆయా రాష్ట్రాలు, పర్యాటక ప్రాంత అధికారులు యునిక్ క్యాంపెయిన్స్‌తో జనాలను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ‘వర్కేషన్’ (వర్క్ + లొకేషన్) అనే వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

కరోనా పాండమిక్ వల్ల ఉద్యోగులంతా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్న విషయం తెలిసిందే. కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆ విషయాన్ని చెప్పాయి కూడా. అయితే, కరోనా కారణంగా జనాలెవరూ ప్రయాణాలు చేయడం లేదు. టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లడం లేదు. దీంతో టూరిజం ఇండస్ట్రీ కుదేలైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులను, జనాలను అట్రాక్ట్ చేయడానికి ఉత్తరాఖండ్ ‘వర్క్ ఫ్రమ్ మౌంటెన్స్’ అనే సరికొత్త ఆలోచనను తెరమీదకు తీసుకొచ్చింది. దీన్నే ‘వర్కేషన్’గా అభివర్ణిస్తున్నారు. వర్కేషన్ ప్యాకేజ్‌లో భాగంగా.. ట్రెక్కింగ్, బైకింగ్, బర్డ్ వాచింగ్, స్టార్‌గేజింగ్ ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీ.. ప్యాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని ఉత్తరాఖండ్ టూరిజం సెక్రెటరీ దిలీప్ జవాల్కర్ తెలిపాడు. అంతేకాదు.. హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్, కంఫర్ట్‌బుల్ స్టే, మెడికల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్, హెల్తీ, ఫ్రెష్ ఫుడ్ ఇలా అన్ని సదుపాయలు కల్పిస్తామని ఆయన చెబుతున్నారు.

ఉత్తరాఖండ్ ఎంతో అందమైన ప్రదేశం. ఎత్తైన కొండలు, వెల్లివిరిసే పచ్చదనం, స్వచ్ఛమైన గాలితో పాటు ముస్సోరి, డెహ్రాడూన్, నైనిటాల్ వంటి పర్యాటక ప్రాంతాలు ప్రతి ఏటా సందర్శకులను అట్రాక్ట్ చేస్తుంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ఇంట్లోనే ఉంటూ బోర్ కొడుతున్న ఉద్యోగులకు నిజంగానే.. ఇది మంచి అవకాశం. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ.. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను వర్క్ ఫ్రమ్ మౌంటెన్స్‌‌గా మార్చేసుకోవచ్చు.

Advertisement

Next Story