- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుట్‌బాల్ మ్యాచే.. స్పెయిన్ కొంపముంచిందా?
చైనాలోని వూహాన్ నగరంలో బయటపడిన కరోనా వైరస్.. అక్కడి నుంచి తొలుత యూరప్ దేశాలకే పాకింది. చైనా తర్వాత అత్యధికంగా నష్టపోయింది ఇటలీ దేశమే. కానీ ఆ దేశ పాలకుల నిర్లక్ష్యం కారణంగా మరింత వేగంగా పక్క దేశాలకు కూడా వ్యాపించింది. ఇటలీలో జరిగిన ఒక ఫుట్‌బాల్ మ్యాచే.. ఇందుకు ముఖ్య కారణమని వైద్య విశ్లేషకులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 19న ఇటలీలోని మిలాన్ నగరంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. దీనికి స్పెయిన్ నుంచి 3 వేల మందికి పైగా అభిమానులు వచ్చారు. వీరంతా వెలన్షియా క్లబ్ అభిమానులే కావడం గమనార్హం.
ఇటలీలో అప్పటికే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఫుట్‌బాల్ మ్యాచ్‌కు అనుమతించి ఇటలీ ఘోర తప్పిదం చేసింది. ఈ మ్యాచ్ వీక్షించడానికి 40 వేల మంది ఇటాలియన్లు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది నార్త్ ఇటలీలోని లొంబర్డీ ప్రాంతం నుంచి వచ్చిన వారే. కాగా, ఇటలీలో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నది కూడా లొంబర్డి ప్రాంతంలోనే. అక్కడి నుంచి వచ్చిన వాళ్లు కేవలం స్టేడియంలోనే కాక.. సమీపంలోని పార్కులు, బార్లలో తిరిగి వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు.
Tags: Italy, spein, football match, corona, Europe countries, Milan city